కర్ణాటక లో జరిగిన విషయంలాగా దీనిని భావించకుండా ఈ విషయం అందరూ తెలుసుకోవాలి అనేది నా మనవి.ఇలాంటిదే మన రాష్ట్రాలలో కూడా జరిగే అవకాశం లేకపోలేదు. గత కొన్ని రోజుల నుండి కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా 20000 మంది ప్రైవేట్ డాక్టర్లు సమ్మె బాట పడ్డారు. దీనికి ముఖ్య కారణం KPME Act,(కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎక్సస్టాబ్లిష్మెంట్ Act). అసలు ఏమిటీ చట్టం, ఎందువల్ల డాక్టర్లు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని తెలుసుకుందాం.
ఈ విషయాన్ని మనం 3 కోణాల్లో చూడవచ్చు. ప్రభుత్వం, ప్రైవేటు వైద్యులు మరియు సామాన్య ప్రజలు అనే 3కోణాల్లో ఈ విషయం గురించి తెలుసుకుందాం.
KPME చట్టంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు:
- ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ గుర్తింపు పొంది ఉండాలి.
- ప్రభుత్వ అనుమతులు లేని హాస్పిటల్స్ పైన కఠిన చర్యలు చేపట్టడం.
- క్లినికల్ రికార్డులు సరిగ్గా నిర్వహించకపోతే వారిపైన కఠిన చర్యలు చేపడతారు.
- ప్రతి వైద్యసేవకు ముందే ధర నిర్ణయించడం జరుగుతుంది దానిని ఖచ్చితంగా పాటించాలి.
- అత్యవసర సేవలలో డబ్బులు కట్టకపోతే వైద్యం నిరాకరించడం కుదరదు.
- హాస్పిటల్ వాళ్ళకు విధించే ఫైన్ ప్రస్తుతం 10000ను గరిష్టంగా 5 లక్షల రూపాయలకి పెంచారు.
- వైద్యుల నిర్లక్ష్యం వల్ల కానీ లేక హాస్పిటల్ లో మరే ఇతర కారణాల వల్ల అయిన ఒక వ్యక్తికి మరణం లేదా ఏదైనా కీడు జరిగినట్లుఅయితే దానికి ఆ డాక్టర్ లేక ఆ హాస్పిటల్ పూర్తి భాద్యత వహించాలి. వారి నిర్లక్ష్యం నిజమని తేలితే 3సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలి.
ఈ విషయాన్ని మనం 3 కోణాల్లో చూడవచ్చు. ప్రభుత్వం, ప్రైవేటు వైద్యులు మరియు సామాన్య ప్రజలు అనే 3కోణాల్లో ఈ విషయం గురించి తెలుసుకుందాం.
ప్రభుత్వ కోణంలో:
ప్రజలకు మేలు చేసే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టే విధంగా, తమ రాష్ట్రాన్ని ఆరోగ్య సూచీలో ముందు వరుసలో ఉంచే విధంగా, తమ పార్టీకి తరువాత ఎన్నికల్లో చాలా మంచి ప్రాధాన్యత కల్పించుకోవడం కోసం కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టం చేయాలని భావించింది. నిజానికి ఇది ఒక మంచి చర్య అని చెప్పవచ్చు.
ప్రైవేట్ డాక్టర్ల కోణంలో:
కొంతమంది ప్రైవేట్ డాక్టర్లు చెప్తున్న విషయం ఏమిటంటే ఏదైనా ఘఠన జరిగి హాస్పిటల్ కి అత్యవసరంగా చికిత్స కోసం ప్రజలు వచ్చినపుడు వారికి తగిన చికిత్స ఇవ్వడానికి తాము ప్రయత్నిస్తాం కానీ ఎక్కడైనా ట్రాఫిక్ లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా ఆలస్యంగా హాస్పిటల్ కి తీసుకుని వస్తే కాపాడటం కష్టం. ఇందువల్ల ఈ చట్టం ప్రకారం ఆ డాక్టర్ శిక్ష అనుభవించాలి లేదా జరిమానా కట్టాలి. మరో కోణంలో ఒక ప్రధాన నగరంలో ఒక స్థలం కొని, దాదాపు 30 పైగా ప్రభుత్వ అనుమతి తీసుకుని వారికి అనుమతుల సమయంలో మరియు హాస్పిటల్ నడుస్తున్న సమయంలో ప్రభుత్వానికి టాక్స్ లు కట్టినపుడు ప్రజలకి తక్కువ ధరకు వైద్యం అందించాలంటే ఆయా టాక్స్ లు రద్దు చేసి తక్కువ ధరకు వైద్యం అందించవచ్చు లేదా ప్రభుత్వ హాస్పిటల్స్ వారు సరిగ్గా నిర్వహిస్తే అసలు ప్రైవేటు హాస్పిటల్ కి ప్రజలు ఇంత ఎక్కువ సంఖ్యలో రావలసిన అవసరం ఉండదు కదా అని వారు వాదిస్తున్నారు. ఏ రంగంలో అయిన సీనియర్ లేదా బాగా గుర్తింపు పొందిన వారికి అధిక ధనం అడిగే అవకాశం ఉంది అని గుర్తు చేస్తున్నారు. ప్రతి వైద్య సేవలకు ధర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామని తెలుపుతున్నారు.
ప్రజల కోణంలో ఈ సమస్య:
ప్రజలు ఇటువంటి కఠిన మరియు ప్రజలకి మంచి చేసే చట్టాలను ఆహ్వానిస్తున్నారు. కానీ ఇదే సమయంలో డాక్టర్లు చేస్తున్న వాదనల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఎటువంటి సవరణ లేకుండా ఇలాంటి చట్టం అమలులోకి వస్తే ప్రైవేట్ వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి వైద్యం ఇవ్వడానికి నిరాకరించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అసలు ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరు బాగుంటే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళవలసి అవసరం ఉండదు కదా అనేది సామాన్య వ్యక్తి అభిప్రాయం, అలాగే డాక్టర్లు కూడా కేవలం తాము హాస్పిటల్ పైన ఇంత పెట్టుబడి పెట్టాము దానికి తగిన విధంగా ఫీజులు మేమే విధిస్తాం అని డాక్టర్ వృత్తిని వ్యాపారం లాగా మాట్లాడటం సరికాదు అనేది ఒక సాధారణ వ్యక్తి అభిప్రాయం. ఇది ఈ విషయంలో నా అభిప్రాయం మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.